అధిక రాబడి వచ్చే పంటలను ప్రోత్సహించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

కొల్చారం, వెలుగు: అధిక రాబడి వచ్చే పంటలు సాగుచేసేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్​రాహుల్​రాజ్​అగ్రికల్చర్​అధికారులకు సూచించారు. గురువారం కొల్చారంలోని రైతు వేదికలో అగ్రికల్చర్, హార్టికల్చర్​అధికారులకు ఆయిల్ పామ్ సాగు విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉత్పత్తి ఖర్చు తగ్గించి రాబడిని పెంచేలా రైతుల్లో చైతన్యం కల్పించాలన్నారు. ప్రతీ వ్యవసాయ విస్తీర్ణాధికారి తన క్లస్టర్ పరిధిలో గల గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు సలహాలు, సూచనలు అందించాలన్నారు.

బ్యాంకులో రుణాలు పొందలేని రైతుల వివరాలను సేకరించి  సంబంధిత బ్యాంకు అధికారులతో మాట్లాడి రుణాలు మంజూరు అయ్యేవిధంగా తోడ్పాటు అందించాలని చెప్పారు. రైతు భరోస,  రైతు బీమా, పీఎం కిసాన్, పంటల నమోదు, వరి కొనుగోలు, ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం వంటి కార్యక్రమాల్లో ఏఈవోలు చురుకుగా పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అగ్రికల్చర్​ఆఫీసర్​గోవిందు, జిల్లా హార్టికల్చర్​ఆఫీసర్​నర్సయ్య, ఆయిల్ ఫామ్ సాగు రాష్ట్ర ప్రత్యేక అడ్వైజర్ శ్రీరంగ నాయకులు పాల్గొన్నారు.

జడ్పీ ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలి

మెదక్: జిల్లా పరిషత్​కార్యాలయ ఉద్యోగులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని జడ్పీ స్పెషల్​ఆఫీసర్, కలెక్టర్​రాహుల్​రాజ్​ సూచించారు. గురువారం ఆయన జడ్పీ ఆఫీస్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ నిర్వహణ, సిబ్బంది అటెండెన్స్​రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం మెదక్ స్పోర్ట్స్​స్టేడియంలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్​ను పరిశీలించారు. ఈ సందర్భంగా మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్స్ భద్రపరచిన స్ట్రాంగ్​రూమ్ రిజిస్టర్​ను తనిఖీ చేశారు.  కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ శ్రీనివాసరావు ఉన్నారు.