గీత కార్మికులు రక్షణ కిట్లను ఉపయోగించుకోవాలి

ఆసిఫాబాద్, వెలుగు: గీత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కాటమయ్య రక్షణ కిట్లను సద్వినియోగం చేసుకోవాలని ఆసిఫాబాద్​కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. మంగళవారం కలెక్టరేట్​లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్షణ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్ తో కలిసి పాల్గొ న్నారు. 

కలెక్టర్ మాట్లాడుతూ.. గీత కార్మికుల సంక్షేమం, రక్షణ కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. గీత కార్మికులకు ప్రమాదాలు జరగకుండా వారికి శిక్షణ ఇచ్చి కాటమయ్య రక్షణ కిట్లను అందిస్తున్నామని తెలిపారు. సిర్పూర్ నియోజకవర్గంలో 38 మంది, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 31 మందికి కిట్లు అందించినట్లు చెప్పారు.