స్టూడెంట్స్ మత్తుకు బానిస కావొద్దు : కలెక్టర్ మనుచౌదరి

సిద్దిపేట రూరల్, వెలుగు: స్టూడెంట్స్ మత్తుకు బానిస కావొద్దని కలెక్టర్ మనుచౌదరి సూచించారు. అంతర్జాతీయ డ్రగ్‌ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం గవర్నమెంట్​జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నుంచి ఓల్డ్ బస్టాండ్ వరకు ర్యాలీ తీశారు. అంతకుముందు ప్రభుత్వం జారీచేసిన "డ్రగ్స్ కి నో చెప్పండి" అనే పోస్టర్, టీ షర్ట్ ను ఆవిష్కరించి వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన స్టూడెంట్స్ కు బహుమతులు అందజేశారు. అనంతరం కలెక్టర్​మాట్లాడుతూ.. స్టూడెంట్స్ చెడు అలవాట్ల బారిన పడకుండా తమకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ దిశగా కృషి చేయాలన్నారు. ర్యాలీలో జడ్పీ చైర్పర్సన్ రోజ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి శారద, ఎక్సైజ్ సూపరింటెండెంట్​శ్రీనివాసమూర్తి, డీఆర్డీఏ  జయదేవ్ ఆర్యా పాల్గొన్నారు.

డ్రగ్స్‌ రహిత సమాజాన్ని ఏర్పాటు చేద్దాం

డ్రగ్స్​రహిత సమాజాన్ని ఏర్పాటు చేద్దామని సీపీ అనురాధ పిలుపునిచ్చారు. పోలీసు అధికారులు, సిబ్బంది, స్టూడెంట్స్​తో కలిసి కొత్త బస్టాండ్‌ నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్‌ వినియోగం వల్ల కలిగే అనర్థాలు అనే అంశంపై వ్యాసరచన, ఉపన్యాసం, పెయింటింగ్‌ పోటీలు నిర్వహించగా గెలుపొందని స్టూడెంట్స్​కు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీలు మల్లారెడ్డి, రామచంద్రరావు, సుభాష్‌ చంద్రబోస్, ఏసీపీ మధు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసమూర్తి, సీఐలు విద్యాసాగర్ , లక్ష్మీబాబు, ఉపేందర్, రామకృష్ణ, కిరణ్, ఎస్‌ఐ అపూర్వరెడ్డి పాల్గొన్నారు.