డ్రగ్స్​ నియంత్రణకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి : కలెక్టర్ మనుచౌదరి

సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లాలో డ్రగ్స్​నియంత్రణకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో ఆయన పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్​లో డ్రగ్స్ నివారణపై వ్యాసరచన, క్వీజ్ పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్టూడెంట్స్​కు నగదు బహుమతులు అందజేయాలన్నారు. పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని డీఈవోకి సూచించారు.

బీహర్, యూపీ రాష్టాల నుంచి లేబర్ పనులు చేసే వారికి  డ్రగ్స్ రవాణా చేస్తున్న వారిపై నిఘా పెట్టాలన్నారు. జిల్లా కేంద్రంలో డ్రగ్స్ రిహబిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని దీనికి సంబంధించి స్థలాన్ని వెతకాలని ఆర్డీవోకి సూచించారు. జిల్లాలోని కల్లు కాంపౌండ్, మెడికల్ షాప్ ల్లో అల్ఫ్రాజోలం విక్రయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని ఎక్సైజ్, పోలీస్ అధికారుల ఆయ షాపులపై దాడులు జరిపి విక్రయాలు జరగకుండా చూసుకోవాలన్నారు. సమావేశం లో అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ ఆర్డీవోలు సదానందం, బన్సీలాల్, రామ్మూర్తి, ఎక్సైజ్ సూపరింటెండెంట్​శ్రీనివాసమూర్తి, జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీనివాస్, ఇన్​స్పెక్టర్లు కృష్ణమూర్తి, వినయ సుస్మి, వ్యవసాయ అధికారి మహేశ్, సీఐ రమేశ్​పాల్గొన్నారు.

అత్యున్నత స్థాయికి చేరే యూనిట్​ఎంచుకోవాలి 

మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలు అత్యున్నత స్థాయికి చేర్చే పరిధిగల యూనిట్ ను ఎంచుకోవాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ ఆఫీస్ లో జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళ శక్తి కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాల ఉత్పత్తి, - డైరీ, కోళ్ల ఫామ్​లాంటి విస్తృత పరిధి గల వాటిని ఎంచుకోవాలని మహిళలకు సూచించారు. సమావేశంలో ఎల్డీఎం గిరిబాబు, ఎస్బీఐ, యూబీఐ, ఏపీజీవీబీ ఆర్ఎంలు అరుణ జ్యోతి, వికాస్, ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు.