సిద్దిపేట రూరల్, వెలుగు: శారీరక, మానసిక వికాసానికి వ్యాయామం ఎంతో మేలు చేస్తుందని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. సోమవారం ఆయన అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తో కలసి సిద్దిపేట రెండో ఎడిషన్ హాఫ్ మారధాన్ పోస్టర్ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే శారీరకంగా శ్రమించాలన్నారు.
జూలై 28న సిద్దిపేటలో జరిగే రెండోఎడిషన్ హాఫ్ మారతాన్ లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో కత్తుల బాపురెడ్డి, పరంధాములు, రాజు, వెంకట్, హరి, నర్సింలు, రమేశ్పాల్గొన్నారు.