తక్షణమే చికిత్స అందించాలి : కలెక్టర్ మనుచౌదరి

సిద్దిపేట టౌన్: వైరల్​ఫీవర్స్​తో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన రోగులకు తక్షణమే చికిత్స అందించాలని కలెక్టర్ మను చౌదరి డాక్టర్లను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ను ఆయన  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో నమోదైన డెంగ్యూ, మలేరియా, కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వార్డులకు వెళ్లి పేషంట్లతో మాట్లాడారు.

ఎవరూ అధైర్య పడొద్దని అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరికీ బ్లడ్ శాంపిల్ తీసుకొని అన్ని రకాల టెస్టులు చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవాలని డాక్టర్లకు సూచించారు. అంతకుముందు మిట్టపల్లి గ్రామంలోని అంగన్వాడీ సెంటర్,  మందపల్లి గ్రామంలోని  ప్రభుత్వ ప్రైమరీ స్కూల్​, కేసీఆర్ నగర్,  జడ్పీహెచ్ఎస్ స్కూళ్ల ను పరిశీలించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డీఈవో శ్రీనివాసరెడ్డి, అర్బన్ తహసీల్దార్​సలీం, సెక్టోరియల్ ఆఫీసర్ రామస్వామి పాల్గొన్నారు. 

చెరువులు కుంటల వివరాలు వెల్లడించాలి

సిద్దిపేట: సిద్దిపేట నియోజవర్గంలోని చెరువులు, కుంటల వివరాలు ఇస్తూ వాటి ప్రస్తుత పరిస్థితిని వెల్లడించాలని కోరుతూ కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ మంగళవారం కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. చెరువులు, కుంటలు ఆక్రమణకు గురైతే అక్కడ ప్రస్తుతం నివాస గృహాలు నిర్మించారా.. వాణిజ్య సముదాయాలు నిర్మించారా అనే విషయాల్ని వెల్లడించాలని కోరారు