నర్సాపూర్ (జి), వెలుగు: నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిని గురువారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇన్ పేషెంట్, బయటి రోగుల విభాగం, మందుల గది, టీకాల గదిలో రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో సౌకర్యాలు, అందిస్తున్న చికిత్సలను రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ.. ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచాలన్నారు.
ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో అవసరమైన బెడ్స్, మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.