ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్ ఎం. మను చౌదరి

సిద్దిపేట రూరల్, వెలుగు: ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ ఎం. మను చౌదరి సూచించారు. బుధవారం నంగునూరు మండలం నర్మెట్ట గ్రామ పరిధిలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

62 ఎకరాల విస్తీర్ణం లో సుమారు రూ.300 కోట్లతో ఫ్యాక్టరీ నిర్మిస్తున్నట్టు తెలిపారు. అనంతరం ఫ్యాక్టరీ ఆవరణలో కొబ్బరి మొక్కలను నాటారు. కలెక్టర్ వెంట జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సువర్ణ, టీజీ ఆయిల్ పెడ్ అధికారులు తదితరులు ఉన్నారు. చేయాలని అన్నారు.