ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, వెలగు :  ప్రజావాణి అర్జీలను  వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం  కలెక్టరేట్ లో మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీఓలు  శ్రీనివాస్ రావు, హరికృష్ణతో   ప్రజావాణి అర్జీలను స్వీకరించారు.  కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన చల్ల సత్తయ్య తనకు ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్ భూమిని    అక్రమంగా పట్టా మార్చుకుని రుణమాఫీ పొందిన విషయంపై సమగ్ర విచారణ జరిపి   న్యాయం చేయాలన్నారు..

నెన్నెల మండలం మెట్​పల్లి గ్రామానికి చెందిన దుగుట వెంకటస్వామి తనకు గ్రామ శివారులో భూమి ఉందని, కొంతమంది అక్రమంగా తప్పుడు పత్రాలు సృష్టించి రైతుబంధు డబ్బులు పొందారని, ఈ విషయంపై   న్యాయం చేయాలన్నారు. హాస్టళ్లలో  విద్యార్థులకు, వార్డెన్లకు బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని కోరుతూ  పీడీఎస్​యూ  విద్యార్థి సంఘం ప్రతినిధులు   కోరారు.