ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి : కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీఓలు శ్రీనివాస్ రావు, హరికృష్ణలతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..  ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణికి 63 దరఖాస్తులు

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​ మీటింగ్​హాల్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 63 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్​ రాజర్షి షా తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి విద్య, వైద్యం, పంచాయతీ, పెన్షన్​, ఇండస్ర్టీ, ఉపాధి శాఖలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.  వెంటనే దరఖాస్తులను పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని  కలెక్టర్​ సంబంధిత అధికారులను ఆదేశించారు.  కార్యక్రమంలో ఆర్డీఓ  వినోద్​కుమార్​, డీఆర్డీఓ సాయన్న, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.