సంగారెడ్డి టౌన్, వెలుగు:ఈ నెల13న జరిగే పార్లమెంట్‌ఎన్నికలకు అన్ని ఏర్పాటు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్క్రాంతి తెలిపారు. గురువారం సంగారెడ్డి కలెక్టర్ఆఫీసులో ఎస్పీ రూపేశ్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. 13న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్ సూచించిన మేరకు 13 రకాల గుర్తింపు పొందిన ధ్రువీకరణ పత్రాలను ఓటింగ్ సెంటర్‌కు తీసుకొని వెళ్లాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు, సిబ్బందికి అవసరమైన అన్ని వసతులు కల్పించామని స్పష్టం చేశారు.
ప్రతి పోలింగ్ స్టేషన్లో సీసీ కెమెరాల ఏర్పాటు, వెబ్ కాస్టింగ్ ఉంటుందని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఈనెల10 వరకు పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకోవచ్చాన్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు రూ.2 కోట్ల 97 లక్షల నగదు, 3 లక్షల 50 వేల లీటర్ల మద్యాన్ని, 44. 5 గ్రాముల బంగారాన్ని అధికారులు సీజ్ చేసినట్లు తెలిపారు. ఎస్పీ రూపేశ్ మాట్లాడుతూ ఎవరూ ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు.