టీబీ నిర్ధారణ క్యాంపులు ఏర్పాటు చేయాలి : కలెక్టర్ క్రాంతి

కంది, వెలుగు: టీబీ నిర్ధారణకు మెడికల్ క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్ క్రాంతి జిల్లా హెల్త్ ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టర్​ఆఫీసులో జిల్లా టీబీ  కంట్రోల్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి టీబీ నిర్ధారణ మెడికల్ క్యాంపులు నిర్వహించాలన్నారు. హైడెన్సిటీ, ఇండస్ట్రియల్  ప్రాంతాల్లో రెగ్యులర్ గా టీబీ స్క్రీనింగ్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ హాస్పిటల్స్​ నుంచి ఒక్క టీబీ కేసు మిస్ కాకుండా గుర్తించాలన్నారు.

సెల్ప్​ హెల్ప్ మహిళా  గ్రూపుల  సమావేశంలో టీబీ గురించి అవగాహన  కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. టీబి పేషెంట్స్ కు ఇబ్బంది లేకుండా ఆశా వర్కర్స్ ద్వారా మందులు ఇంటికే పంపించాలని ఆదేశించారు. ఎన్జీవో సంస్థలు రెగ్యులర్ గా ఎక్స్ రే క్యాంప్స్ నిర్వహించాలని,  ప్రైవేట్ హాస్పిటల్ నుంచి టీబీ అనుమానితుల శాంపిల్స్ డీఏంసీలకు తరలించాలన్నారు.

సమావేశంలో డీఎంహెచ్​వో గాయత్రీ దేవి, డీసీహెచ్ వో సంగారెడ్డి, డీటీసీవో  రాజేశ్వరి, డీఐవో శశాంక్ దేశ్​పాండే, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అనిల్ కుమార్, గవర్నమెంట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్, ఐఎంఏ మంజీర ప్రెసిడెంట్ ఉషా కిరణ్, ఐఏపీ  ప్రెసిడెంట్ చక్రపాణి, డిప్యూటీ జడ్పీ సీఈవో జానకిరెడ్డి, డీఆర్డీఏ ఏపీడీ, ఐఆర్ సీఎస్​ చైర్ పర్సన్ వనజారెడ్డి, టీబీ అలర్ట్ ఎన్జీవో సభ్యులు పాల్గొన్నారు.

బడిబాటను సక్సెస్ చేయాలి 

సదాశివపేట: ప్రైవేట్ స్కూల్స్​కు ధీటుగా గవర్నమెంట్​స్కూళ్లను తీర్చిదిద్దాలని బడిబాటను సక్సెస్​ చేయాలని కలెక్టర్ క్రాంతి అన్నారు. సదాశివపేట మండల పరిధిలోని కోనాపూర్​ జడ్పీహెచ్​ఎస్, పట్టణ పరిధిలోని పీఎస్​ఎమ్​ఎల్​ కాలనీలోని ప్రైమరీ స్కూళ్లను సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ గవర్నమెంట్​ స్కూళ్లలో హాజరు శాతం పెంచాలని, బడిబాట లో సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు విలేజ్​ ఎడ్యుకేషనల్​ రిజిస్టర్​లో నమోదు చేయాలన్నారు.