బాలరక్ష, వృద్ధాశ్రమ భవనాలు పూర్తి చేయాలి : కలెక్టర్ క్రాంతి

సంగారెడ్డి టౌన్ , వెలుగు: బాలరక్ష, వృద్ధాశ్రమ భవనాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్​ క్రాంతి అధికారులకు సూచించారు. మంగళవారం ఆమె సంగారెడ్డి పట్టణంలోని బాలసదనం, శిశు గృహ, సఖి కేంద్రాలను సందర్శించారు. చిన్నారులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. శిశు గృహకు చిన్నారులు ఎక్కడి నుంచి వచ్చారు. వారి సంబంధీకులు ఎవరైనా ఉన్నారా  లేదా తెలుసుకోవాలన్నారు. 

పిల్లలు దత్తతకు తొందరగా వెళ్లేలా చూడాలని సూచించారు. మూడు నుంచి ఐదేళ్ల పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపాలన్నారు. సఖి కేంద్రాన్ని సందర్శించి అక్కడికి వచ్చే మహిళలకు, ఆడపిల్లలకు ఎలాంటి సేవలు అందిస్తున్నారన్నది తెలుసుకున్నారు.181 కు వచ్చే కాల్స్ పై వెంటనే స్పందించి వారికి అన్ని విధాలా సేవలు అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమాధికారి లలిత కుమారి, డీసీపీవో రత్నం, చక్రపాణి, పబ్లిక్ హెల్త్ డిపార్ట్​మెంట్,  సఖి ఎస్ఎస్ఏ సిబ్బంది ఉన్నారు.