సంగారెడ్డి టౌన్, వెలుగు: అమ్మ ఆదర్శ స్కూల్స్లో చేపట్టిన పెండింగ్పనులను వారంలో పూర్తి చేయాలని కలెక్టర్ క్రాంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టర్ఆఫీసులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ..కొత్త అంగన్వాడీల నిర్మాణం త్వరగా చేపట్టాలన్నారు. బడి మానేసిన పిల్లలందరినీ సర్కారు బడుల్లో చేర్పించాలన్నారు. సమావేశంలో అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్, డీఈవో వెంకటేశ్వర్లు, డీఆర్డీవోపీడీ జ్యోతి, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
పోషకాహారం తీసుకోవాలి
కిషోర బాలికలు పోషకాహారం తీసుకోవాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. బేటీ బచావో- బేటీ పడావోలో భాగంగా శిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారత ఆధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదుగా గర్ల్ చైల్డ్ న్యూట్రిషన్ కిట్లను బాలికలకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్లలు మనుగడ సాధించాలంటే చదువే ఆయుధం అన్నారు. 16 వస్తువులతో కూడిన కిట్ లో ప్రతి వస్తువును ఉపయోగించుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి లలితకుమారి, డీసీపీవో రత్నం, జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త పల్లవి, కిషోర బాలికలు పాల్గొన్నారు.