ప్రభుత్వ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్

 సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లా కేంద్రంలోని ఇందిరా నగర్ జడ్పీ హై స్కూల్ ను మంగళవారం కలెక్టర్​మనుచౌదరి సందర్శించి స్టూడెంట్స్​, టీచర్ల హాజరుపట్టికను తనిఖీ చేశారు. వంటగదిని పరిశీలించి స్టూడెంట్స్​కు మధ్యాహ్న భోజనం వండేటప్పుడు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అనంతరం సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, రోబోటిక్ ల్యాబ్ ను పరిశీలించి స్టూడెంట్స్​ప్రయోగాలను చూశారు. కొత్త ఆవిష్కరణలు రూపొందించేలా శాస్త్రీయ ఆలోచన పెంపొందించుకోవాలని స్టూడెంట్స్​కు సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారి రామస్వామి, టీచర్లు ఉన్నారు.

 మౌలిక వసతుల కల్పనకు చర్యలు

కోహెడ: కేజీబీవీలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్​ మనుచౌదరి హామీ ఇచ్చారు. మండలంలోని తంగళ్లపల్లి కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టూడెంట్స్​కి కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. టెన్త్​ క్లాస్​స్టూడెంట్స్​తో మాట్లాడి వారి జ్ఞానాన్ని  తెలుసుకున్నారు. అనంతరం స్కూల్​లో మొక్కలు నాటారు. ఆయన వెంట తహసీల్దార్​ సురేఖ, ఎంపీడీవో కృష్ణయ్య, ఏఈ సాయి ఉన్నారు.