- అధికారులను ఆదేశించిన కలెక్టర్ క్రాంతి
రామచంద్రాపురం (అమీన్పూర్), వెలుగు : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని పెద్ద చెరువు ఎఫ్టీఎల్, బప్ఫర్జోన్ల పరిస్థితిపై పూర్తి నివేదిక తయారుచేయాలని కలెక్టర్క్రాంతి అధికారులను ఆదేశించారు. గురువారం అమీన్పూర్పెద్ద చెరువును రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్‌శాఖల అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. వాణి నగర్, దశరథ్ కాలనీలు మొదలుకొని చెరువు చుట్టూ పర్యటించి అవుట్లెట్ కాల్వల గురించి ఆరాతీశారు.
అనంతరం పెద్ద చెరువు కింద నీట మునిగిన కాలనీలు, వెంచర్ల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చెరువు పరివాహక ప్రాంతాలు, అవుట్ లెట్ కాల్వల విషయంలో మరింత విచారణ జరగాల్సి ఉందన్నారు. చెరువు నుంచి బయటకు వచ్చే నీరు ఎటు వైపు వెళ్తోంది, మిగులు నీరు వెళ్లే తూములపై పూర్తి నివేదిక తయారు చేయాలన్నారు. ముంపు ప్రాంతాల బాధితులకు తగిన పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
అలుగులు, అవుట్ లెట్ కాల్వలకు సంబంధించిన మ్యాపులను పరిశీలించి వాటర్ ఎటు వైపు వెళ్లాలనే దానిపై స్పష్టత తీసుకొస్తామన్నారు. ఆమె వెంట అడిషనల్కలెక్టర్చంద్రశేఖర్, ఇరిగేషన్ ఎస్ఈ మురళీధర్, డీఈ రామస్వామి, మున్సిపల్కమిషనర్జ్యోతిరెడ్డి, తహసీల్దార్ రాధ, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.