విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయాలి : అభిలాష అభినవ్

  • కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు:  విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ ఫేర్ లు దోహద పడతాయని కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. శుక్రవారం సెయింట్ థామస్ స్కూల్​లో విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఇన్​స్పైర్,  విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం, కొత్త విషయాలు నేర్చుకోవాలనే కుతూహలం పెరుగుతాయన్నారు.

విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు చేసేలా టీచర్లు ప్రోత్సహించాలని సూచించారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ లో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల నుంచి 800 మంది పాల్గొన్నారన్నారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి. అనంతరం ఎన్ సీసీ అధికారులకు కలెక్టర్ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డీఈవో రామారావు, గ్రంథాలయ చైర్మన్ అర్జుమన్ అలీ, తహసీల్దార్ రాజు, ఏసీజీఈ పద్మ, ఎస్ వో సలోమి కరుణ, వివిధ స్కూళ్ల టీచర్లు పాల్గొన్నారు.

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు:  విద్యార్థుల్లో సృజనాత్మకతతో పాటు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు  టీచర్లు కృషి చేయాలని ఆదిలాబాద్​కలెక్టర్​ రాజర్షి షా సూచించారు. శుక్రవారం పట్టణంలోని సెంట్​ జోసెఫ్​ కాన్వెంట్ స్కూలులో ఏర్పాటుచేసిన ఇన్‌స్పైర్​ మనక్, జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌‌కు ఎమ్మెల్యే పాయల్​ శంకర్​తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ టెక్నాలజీని ఉపయోగించుకొని విద్యార్థులు  సృజనాత్మకంగా ఆలోచించడం ద్వారా  నూతన ఆవిష్కరణలు రూపొందించవచ్చని సూచించారు. కార్యక్రమంలో  జిల్లా సైన్స్ అధికారి రఘు రమణ,  సెక్టోరియల్ అధికారి నారాయణ,  వివిధ కమిటీల  కన్వీనర్లు, హెచ్ఎంలు, తదితరులు  పాల్గొన్నారు.