సేంద్రీయ ఉత్పత్తులను వినియోగించాలి: కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు: సేంద్రియ ఆహార పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లో సేంద్రియ పదార్థాల చిరు ఆహార కేంద్రంతోపాటు ఫిష్​ స్టాల్​ను అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్​తో కలిసి ప్రారంభించారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోందని, సేంద్రియ పంటల వైపు మొగ్గుచూపుతున్నారని తెలిపారు. 

సేంద్రియ ఉత్పత్తులతో తయారు చేసిన ఆహార పదార్థాల స్టాల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా అధికారులు, సిబ్బంది, కార్యాలయానికి వచ్చే ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. డీఆర్డీవో విజయలక్ష్మి, డీఎస్ వో కిరణ్ కుమార్, డీఏవో అంజి ప్రసాద్, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రాంగోపాల్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.