నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్ర వారం బాధ్యతలు స్వీకరించారు. జడ్పీ పాలక వర్గం పదవీ కాలం పూర్తి కావడంతో కలెక్టర్‌ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జడ్పీ సీఈవో గోవింద్, ఇతర అధికారులు కలెక్టర్ కు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యాలయ విభాగాలను పరిశీలించి అధికారులకు, సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు చేశారు.
విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచాలి...
నిర్మల్, వెలుగు: బొమ్మల పుస్తకాలతో విద్యార్థుల్లో పఠనాసక్తిని పెరుగుతుందని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. రూమ్ టు రీడ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో డీ కోడబుల్ (బొమ్మల) పుస్తకాలను కలెక్టరేట్లో ఆమె విడుదల చేశారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీల్లోని విద్యార్థులకు ఈ పుస్తకాలు అందించనున్నట్లు తెలిపారు.