సైబర్ ​దాడుల బాధితులకు పరిహారం కాయిన్ స్విచ్ ప్రకటన

హైదరాబాద్​, వెలుగు: క్రిప్టో ప్లాట్ ఫామ్ కాయిన్ స్విచ్ తన వినియోగదారులు సైబర్​దాడుల వల్ల డబ్బు పోగొట్టుకున్న వారికి పరిహారం చెల్లించడానికి కాయిన్ స్విచ్ కేర్స్ పేరుతో రూ.600 కోట్ల సహాయ నిధిని ప్రకటించింది. 2024 జులైలో వచ్చిన వజీర్ ఎక్స్ సైబర్ దాడి వల్ల చాలామంది క్రిప్టో వినియోగదారులు నష్టపోయారు. వీరిని ఆదుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

వినియోగదారులు తమ డబ్బును తిరిగి పొందడంలో సహాయపడటమే కాకుండా భారతీయ క్రిప్టో కమ్యూనిటీని మరింతగా ప్రోత్సహించేందుకు ఈ నిధులను రెండేళ్ల పాటు ఉపయోగిస్తారు. ఈ  కార్యక్రమం ద్వారా బాధిత వినియోగదారులు రివార్డ్‌‌ లను పొందవచ్చని, మార్కెట్‌‌లోకి తిరిగి ప్రవేశించవచ్చని కాయిన్​ స్విచ్ ​తెలిపింది.  వజీర్ ఎక్స్ సైబర్ దాడిలో డబ్బు పోగొట్టుకున్న వాళ్లందరూ ఈ  ప్రోగ్రామ్‌‌లో పాల్గొనడానికి అర్హులు.