కౌటాల మండలం రైతులకు కొబ్బరి మొక్కల పంపిణీ

కాగ జ్ నగర్, వెలుగు: ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు కొబ్బరి మొక్కల పంపిణీ చేశారు. కౌటాల మండలం లో మొత్తం 1000 మొక్కలను ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి నుంచి తెప్పించి అందజేశారు. ఒక్కో మొక్క కు రైతులు రూ. 130  చెల్లించారు. రెండేళ్ల వయసున్న కొబ్బరి మొక్కలు ఎకరాకు నలభై చొప్పున బండ్ ప్లాంటేషన్ లో నాటేందుకు అందించారు.

 ఆరేళ్ల లో కాపుకు వస్తాయని ఏ పీ ఓ పూర్ణిమ తెలిపారు. వీటికి రెండేళ్ల వరకు నెల నెలా వాచ్ అండ్ వార్డ్ కింద మెయింటనెన్స్​ ఇస్తామని పేర్కొన్నారు. ఈ సీ సంతోష్, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ లు ఉన్నారు.