సీఎన్జీ ధర రూ. 2 పెంపు

న్యూఢిల్లీ : దేశంలోని అనేక నగరాల్లో సీఎన్జీ ధర కిలోకు రూ. 2 పెరిగింది. త్వరలో ఎన్నికలు జరగనున్న ఢిల్లీలో మాత్రం ధరలు మారలేదు.  దేశ రాజధాని,  చుట్టుపక్కల నగరాల్లో సీఎన్జీ, సహజవాయువును గృహాలకు సరఫరా చేసే ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్, వారాంతంలో సీఎన్జీ ధరను కిలోకు 2 రూపాయలు పెంచింది.  నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్​,  ఇతర నగరాల్లో ధరలు పెరిగాయి.   

ముంబైలోని సిటీ గ్యాస్ రిటైలర్ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (ఎంజీఎల్) ముంబై  పరిసర ప్రాంతాల్లో సీఎన్జీ ధరలను కిలోకు రూ. 2 చొప్పున పెంచింది.  ఎంజీఎల్,​  ఇతర సిటీ గ్యాస్ రిటైలర్లు అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ వంటివి, ఇన్‌‌పుట్ కాస్ట్‌‌లో 20 శాతం పెరిగినప్పటికీ గత రెండు నెలలుగా రిటైల్ ధరలను మార్చలేదు.  సోమవారం ఇతర సిటీ గ్యాస్ రిటైలర్లు కూడా సీఎన్జీ ధరలను పెంచారు.  హైదరాబాద్​లో మాత్రం ధరలు మారలేదు.