ఉత్పత్తి కన్నా కార్మికుల ప్రాణాలే ముఖ్యం : సీఎండీ బలరాం నాయక్‌‌‌‌‌‌‌‌

  • సింగరేణి చరిత్రలోనే ఫస్ట్‌‌‌‌‌‌‌‌టైం అన్ని గనుల సేఫ్టీ, మైన్స్ కమిటీ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌

కోల్​బెల్ట్, వెలుగు : సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి కన్నా కార్మికుల ప్రాణాలే ముఖ్యమని, సేఫ్టీ పాటిస్తూ ప్రమాద రహిత సింగరేణే లక్ష్యంగా పనిచేయాలని సీఎండీ ఎన్‌‌‌‌‌‌‌‌.బలరాంనాయక్‌‌‌‌‌‌‌‌ సూచించారు. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా ఆరు జిల్లాలు 11 ఏరియాల్లోని 40 గనులు, డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లకు సంబంధించిన సేఫ్టీ, వర్క్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌ ఇన్‌స్పెక్టర్లు, మైన్స్‌‌‌‌‌‌‌‌ కమిటీ సభ్యులు, సేఫ్టీ సూపర్‌‌‌‌‌‌‌‌వైజర్లతో శనివారం సీఎండీ వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సింగరేణి సంస్థ అన్ని రంగాల్లో అత్యుత్తమ కంపెనీగా నిలిచినప్పటికీ ప్రమాదాల నివారణలో కొంత వెనకబడడ విచారకరమన్నారు. 

ఇందుకు మానవ తప్పిదాలే ఎక్కువ కారణమని, ప్రతి పనికి నిర్దేశించిన రూల్స్‌‌‌‌‌‌‌‌ పాటించకపోవడం వల్లే యాక్సిడెంట్లు జరుగుతున్నాయన్నారు. సేఫ్టీని పాటిస్తూ డ్యూటీ చేయాలని సూచించారు. కార్మికుల రక్షణకు అవసరమైన సౌకర్యాలను సమకూర్చేందుకు సంస్థ ఏ మాత్రం వెనుకాడదని స్పష్టం చేశారు. సింగరేణి హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో అవసరమైన స్పెషలిస్ట్‌‌‌‌‌‌‌‌ డాక్టర్లను నియమిస్తున్నామని, రామగుండం ఏరియా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ను సూపర్‌‌‌‌‌‌‌‌ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. 

సింగరేణిలో సూపరవైజర్లు, ఇతర ఉద్యోగుల కొరత తీర్చేందుకు 1,800 పోస్టులకు ఇప్పటికే నియామక ప్రక్రియ చేపట్టామని, రెండు నెలల్లో ఇది పూర్తవుతుందన్నారు. రివ్యూలో కొత్తగూడెం నుంచి డైరెక్టర్లు ఎన్‌‌‌‌‌‌‌‌వీకే.శ్రీనివాస్, డి.సత్యనారాయణ, జి.వెంకటేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, జీఎం ఎస్‌‌‌‌‌‌‌‌డీఎం.సుభానీ, జీఎం రవిప్రసాద్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.