బీజేపీ అంటే బ్రిటీష్ జనతాపార్టీ..మోదీ కాలనాగులాంటోడు: సీఎం రేవంత్రెడ్డి

జహీరాబాద్ కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. బీజేపీ అంటే భారతీయ జనతాపార్టీ కాదు.. బ్రిటీష్ జనతా పార్టీ అని విమర్శించారు. ఆ పార్టీ ఆలోచన.. విధానం మొత్తం బ్రిటీషోళ్ల విధానం అని అన్నారు. జాతుల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య, మనుషుల మధ్య చిచ్చు పెట్టి విభజించి గద్దెనె క్కడమే బీజేపీ విధానమని అన్నారు. దేశాన్ని దోచుకునేందుకు మరోసారి గెలిచేందుకు ప్రయత్నిస్తుందన్నారు.

బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మారుస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేసి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలను అణగదొక్కాలని బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. అందుకే రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వ్యవ సాయ రంగాన్ని అదానీ , అంబానీలకు కట్టబెట్టి సొంత భూముల్లో బానిసలను చేసేందుకు బీజేపీ కుట్ర చేసిందన్నారు. హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ రైతులు బీజేపీ కుట్రలను తిప్పికొట్టారని అన్నారు. ప్రధాని మోదీ కాలనాగు వంటోడు అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎట్లయినా పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు గెలిచి రైతు లను అణగదొక్కేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. 

పదేళ్లు అటు రాష్ట్రాన్నీ, ఇటు దేశాన్ని పట్టి పీడించిన పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ లు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.. పదేళ్ల పాటు కేసీఆర్ రాష్ట్రాన్ని, మోదీ దేశాన్ని ఏలిండ్రు..వాళ్లు చేసిన అన్యాయం, దుర్మార్గం 140 కోట్ల ప్రజలు చూశారని  అన్నారు.  వందరోజుల్లో ఐదు గ్యారంటీలను అమలు చేసిన కాంగ్రెస్ ను ఓడించాలని కేసీఆర్, మోదీ కుట్రలు చేస్తున్నారని  సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లు దేశాన్ని పట్టి పీడించి.. కార్పేరేట్ కంపెనీలకు దేశాన్ని తాకట్టు పెట్టి 60 లక్షల కోట్ల ఆస్తుల ను మోదీ కార్పొరేట్లకు కట్టబెట్టారని అన్నారు. పదేళ్లు మోసం చేసిన బీజేపీకి బుద్ది చెప్పి కాంగ్రెస్ ను గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ణప్తి చేశారు. 

పదేళ్లు మోసం చేసిన బీజేపీకి బుద్ది చెప్పి వందరోజుల్లో మంచి పనులు చేసిన కాంగ్రెస్ కు అండగా నిలబడాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ణప్తి చేశారు.