- పటాన్‌చెరుకు వరాల వర్షం
- కాట శ్రీనివాస్, నీలం మధు రాజకీయ భవిష్యత్‌కు హామీ
సంగారెడ్డి/ పటాన్చెరు, వెలుగు : సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మెదక్ కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా శనివారం నిర్వహించిన రోడ్‌షో, కార్నర్‌మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. అంతకు ముందుకు పటాన్చెరు కాంగ్రెస్ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ స్థానిక అభివృద్ధి కోసం పలు డిమాండ్లను సీఎం ముందుంచారు. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న యాబై వేల పేదల ఇండ్ల పంపిణీ, మున్సిపల్ట్యాక్సుల తగ్గింపు, స్పెషల్ఫండ్స్కింద మున్సిపాలిటీల అభివృద్ధి, మిషన్‌భగీరథ నీటి సరఫరా, పటాన్చెరు వరకు మెట్రో లైన్విస్తరణ
గోదావరి జలాలు, స్పెషల్ ప్యాకేజీ కింద పటాన్చెరు అభివృద్ధికి ఫండ్స్ మంజూరు చేయాలని కాటా కోరారు. స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి ఆయాహామీలను తప్పకుండా నెరవేరుస్తానన్నారు. కాకపోతే పటాన్చెరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్అభ్యర్థి నీలం మధుకు 50 వేల మెజార్టీ ఇవ్వాలని ప్రజలను కోరారు. ఆ మెజారీటి పార్లమెంట్సెగ్మెంట్మొత్తంలో లక్షకు చేరి మధు గెలవాలన్నారు.
అయితే కాట శ్రీనివాస్‌గౌడ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించి ఉంటే ఈ పాటికే ఆయా హామీలు పటాన్‌చెరుకు వచ్చేవన్నారు. నియోజక వర్గ కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న కాట శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మంచి రాజకీయ భవిష్యత్ ఉందని సీఎం అన్నారు. రాజకీయంగా వారు ఎదగడానికి కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తుందన్నారు.
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు రోడ్‌షో జరగడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని భారీ గజమాలతో సత్కరించి బస్టాండ్ నుంచి అంబేడ్కర్విగ్రహం వరకు రోడ్‌షో నిర్వహించారు. దీనికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరాగా, అంతకు ముందు పలువురు కళాకారులు వివిధ వేషాధారణలో అలరించారు.
కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే రోహిత్‌రావు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ఎన్నికల కోఆర్డినేటర్ శ్యామ్ గౌడ్ పాల్గొన్నారు.