- ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి దామోదర
పెద్దశంకరంపేట, వెలుగు: లోక్ సభ ఎన్నికల ప్రచారం లో భాగంగా పెద్దశంకరంపేట లో ఈనెల 26న సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం పెద్ద శంకరంపేటలో జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్, ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి సభాస్థలిని పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం సభకు లోక్ సభ నియోజక వర్గ పరిధి లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 50 వేల జన సమీకరణ చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రణాళిక సంఘం సభ్యులు నగేశ్ శేఖర్, పీసీసీ మెంబర్ శ్రీనివాస్, నాయకులు వినోద్ పాటిల్, మధు, సురేందర్ రెడ్డి, రాజేందర్ గౌడ్, సంతోష్, సత్యనారాయణ, రాజు, సుభాశ్ గౌడ్, జహంగీర్ తదితరులున్నారు.