మెదక్ జిల్లా కొల్చారంలో బడిబాట కార్యక్రమం రసాభాసకు దారి తీసింది. బడిబాట కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. అయితే ప్రొటోకాల్ విషయంలో కాంగ్రెస్, BRS నేతల మధ్య వివాదం ఏర్పడింది.
అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని MLA సునీతా లక్ష్మారెడ్డి నిరసనకు దిగారు. జై కేసీఆర్, జై కాంగ్రెస్ అంటూ రెండు పార్టీల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో ప్రోగ్రాం మధ్యలోనే మంత్రి కొండా సురేఖ, MLA సునీతా వెళ్లిపోయారు.