సివిల్ సప్లై అప్పు రూ.54 వేల కోట్లు

 

  • తప్పుడు విధానాలను కొనసాగిస్తున్నందు వల్లే ఈ అప్పు
  • ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ 

హైదరాబాద్: రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ రూ.54 వేల కోట్ల అప్పుల్లో ఉందని, ఐదేండ్లు పూర్తి అయ్యేలోపు అది లక్ష కోట్లకు చేరుకుంటుందని ఆదిలాబాద్​ ఎమ్మెల్యే పాయల్ ​శంకర్​ తెలిపారు. గత ప్రభుత్వ తప్పుడు విధానాలను ఇప్పుడు కొనసాగిస్తున్నందు వల్లే ఈపరిస్థితి తలెత్తిందన్నారు. 

ALSO READ : పౌరహక్కుల నేతల అరెస్ట్

సివిల్ సప్లై  శాఖలో జరుగుతున్న తతంగంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్​ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ధాన్యం కొనుగోలులో టెండర్లు దక్కించుకున్న ఐదుగురు బిడ్డర్లు వల్ల అవినీతి జరుగుతోంది. బిడ్డర్లు, మిల్లర్ల మధ్య కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే వేల కోట్ల అప్పులకు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుపై సీబీఐ విచారణ చేయించాలి. ఈ అంశంపై త్వరలోనే గవర్నర్ ను కలిసి వినతిపత్రం అందజేస్తం’అని తెలిపారు.