కార్మికుల పెండింగ్​వేతనాలు చెల్లించాలి

కొమురవెల్లి, వెలుగు: మండలంలోని అన్ని గ్రామపంచాయతీల కార్మికులకు పెండింగ్​లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తాడూరి రవీందర్ డిమాండ్ చేశారు. బుధవారం కొమురవెల్లి లో జీపీ ఉద్యోగ కార్మికుల మండల అధ్యక్షుడు బ్రాహ్మణపల్లి పర్శరాములు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలోని రాంసాగర్, ఐనాపూర్, గౌరాయపల్లి, పోసాన్​పల్లి, కొమురవెల్లి, తపాస్​పల్లి, మర్రిముచ్చాల, కిష్టంపేట గ్రామాల జీపీ కార్మికులు ఐదు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనంతరం కొమురవెల్లి ఎంపీడీవోకి వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో రాజలింగం, సాయిలు, మల్లేశం, పుష్ప, పద్మ, యాదగిరి, కనకరాజు, కనకయ్య, అగ్ని, భాను, రాజు, కనకయ్య, లక్ష్మయ్య, నర్సింలు పాల్గొన్నారు.