కొమురవెల్లిలో దాడికి పాల్పడిన ఏడుగురి అరెస్ట్

కొమురవెల్లి, వెలుగు: ఇటీవల కొమురవెల్లిలో మల్లన్న భక్తులపై దాడికి పాల్పడిన ఏడుగురు యువకులను అరెస్ట్ చేసి  రిమాండ్​కు పంపించినట్లు చేర్యాల సీఐ ఎల్. శ్రీను తెలిపారు.  కొమురవెల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  

హైదాబాద్​కు  చెందిన జాగిరి కరుణాకర్, వెంకట్, జశ్విన్ తమ మిత్రులతో కలిసి ఈనెల 29న  మల్లన్న దర్శనం కోసం వచ్చి గదుల కోసం నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో కొమురవెల్లి గ్రామానికి చెందిన సార్ల నవీన్, చీర్ల శ్రీకాంత్, పేర్ని శివమణి, దేశెట్టి వినయ్, దేశెట్టి నవీన్, పండుగ పవన్, రంగు రాజు కలిసి కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారని తెలిపారు. విచారణ చేపట్టి నిందితులను పట్టుకున్నామన్నారు.  ఈ సమావేశంలో కొమురవెల్లి ఎస్ఐ రాజు గౌడ్, ఏఎస్ఐ సాంబయ్య   తదితరులు ఉన్నారు.