మెదక్ టౌన్, వెలుగు: ప్రభుత్వం లేబర్ కోడ్లను రద్దు చేసి చట్టాలను యథావిధిగా అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు డిమాండ్ చేశారు. బుధవారం మెదక్ పట్టణంలో జిల్లా ప్రెసిడెంట్ మహేందర్ అధ్యక్షతన జరిగిన సీఐటీయూ జిల్లా ఆఫీస్ బెరర్స్ సమావేశంలో చుక్క రాములు మాట్లాడారు. మతం, కులం పేరుతో కార్మికవర్గం విడిపోరాదని, నేటికీ అంటరానితనం, కుల వివక్ష కొనసాగుతోందని దీనికి వ్యతిరేకంగా సీఐటీయూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ విషయంలో కార్మికవర్గం ఐక్యంగా పోరాడినప్పుడే హక్కులు సాధిస్తారన్నారు. రాబోయే కాలంలో ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్, జిల్లా కార్యదర్శి బస్వరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం, బాలమణి, నాగరాజు, కోశాధికారి నర్సమ్మ పాల్గొన్నారు.