పుల్కల్, వెలుగు : బాలకార్మిక నిర్మూలనకు కృషి చేసి, 44సార్లు రక్త దానం చేసిన చౌటకూర్ ఎంఈవో అంజయ్య జాతీయ బంగారు నంది కామధేను అవార్డుకు ఎంపికయ్యారు. జీసీఎస్ వల్లూరి పౌండేషన్ గ్రూప్ ఈ అవార్డును ప్రకటించింది. విద్యకు దూరమై కార్మికులుగా పనిచేస్తున్న అనేక మంది స్టూడెంట్స్ను తిరిగి స్కూళ్లలో
చేర్పించడం, ప్రమాదాలకు గురై ప్రాణాలతో పోరాడుతున్న వారికి రక్త దానం చేసినందుకు ఈ అవార్డుకు ఎంపిక చేశారు. జూన్ 9న అంజయ్య హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఈ అవార్డు అందుకుంటారు.