చేర్యాల, వెలుగు: చేర్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని మున్సిపల్‌వర్కర్స్ అండ్ఎంప్లాయీస్యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చొప్పరి రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మున్సిపల్‌మేనేజర్ ప్రభాకర్‌కు డిమాండ్లతో కూడిన వినితిపత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా రవికుమార్మాట్లాడుతూ .. జీవో 60 ప్రకారంగా వర్కర్స్కు రూ. 15600, డ్రైవర్స్‌కు రూ.19000ల, బిల్ కలెక్టర్, కంప్యూటర్ఆపరేటర్లకు రూ. 21,750 చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ రెండేళ్లుగా చేర్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్న సిబ్బందికి కేవలం రూ. 12000 చెల్లిస్తున్నారన్నారు. కార్యక్రమంలో శోభ, మల్లేశం, శ్రీను, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.