చెన్నూరును మోడల్ ​నియోజకవర్గంగా మారుస్త: ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

* పదేండ్లు అభివృద్ధికి నోచుకోలేదు
* త్వరలో ఇంటింటికి తాగునీరు
* రూ. 125 కోట్లతో సోమనపల్లిలో ఇంటిగ్రెటేడ్​స్కూల్ కడుతం ​
* మందమర్రిలో ఎంపీ వంశీకృష్ణతో కలిసి రూ. 2.80 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన 
* చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

కోల్ బెల్ట్: చెన్నూరు నియోజకవర్గంలో రూ. 500 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించిన్నట్లుగా,  రానున్న రోజుల్లో చెన్నూరును మోడల్  నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి అన్నారు. ఇవాళ మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల్లో 2 కోట్ల 80 లక్షల సీఎస్ఆర్ నిధులతో పలు అభివృద్ధి పనులకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి ఆయన  శంకుస్థాపన చేశారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  పదేండ్లుగా చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మందమర్రికి వచ్చిన్నప్పుడు రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు సమస్యలతో అవస్థలు పడుతున్నామని ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. 

ALSO READ | మందమర్రిలో రూ.2.80 కోట్లతో అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

‘ నేను ఎమ్మెల్యేగా గెలుపొందున వెంటనే ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తున్న.  ఇంటింటికీ తాగునీరు అందించాలని అమృత్​స్కీం రూ. 30 కోట్లతో అందుబాటులోకి తీసుకువస్తున్నం. గతంలో మందమర్రి, బెల్లంపల్లి మున్సిపాలిటీలకు గోదావరి తాగునీరును అందించేందుకు రూ. 24 కోట్లతో కాకా వెంకటస్వామి పర్మినెంట్ స్కీం తీసుకువచ్చారు. విశాఖ ట్రస్టు ద్వారా ట్యాంకర్​లు పెట్టి మందమర్రి వాటర్​సప్లై చేశాం. కాంగ్రెస్​ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తుంది.  నియోజకవర్గంలోని సమస్యలను తెలుసుకోవడానికి మార్నింగ్​వాక్​ చేస్తున్న. సోమనపల్లి రూ. 125 కోట్లతో ఇంటిగ్రెటేడ్​ స్కూల్​ ఏర్పాటు చేస్తున్నం. ఏడాది లోపే అందుబాటులోకి తీసుకువస్తం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేస్తున్నం. ప్రతి వార్డుల్లో సీసీ రోడ్లు నిర్మిస్తాం’ అని వివేక్​వెంకటస్వామి అన్నారు.  ఊరు మందమర్రిలో రూ. 62లక్షలతో  సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

విశాఖ ట్రస్టుతో పేదలకు సేవ చేస్తం: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
బీఆర్ఎస్​ పాలనలో పెద్దపల్లి పార్లమెంట్​అభివృద్ధికి నోచుకోలేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఇవాళ  పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం  మల్లాపూర్​ సోషల్​ వెల్ఫేర్​ స్కూల్ లో  విద్యార్థుల కోసం 150 ​బెంచీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కాకా వెంకటస్వామి  పేదల కోసమే అంబేద్కర్​ విద్యాసంస్ధలను స్టార్ట్​చేశారని తెలిపారు. కాకా, విశాఖ చారిటబుల్​ ట్రస్టులతో  పేదలకు సేవ చేస్తామన్నారు.  కార్యక్రమంలో విశాఖ ట్రస్టు సభ్యులు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.