ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ప్రత్యేక పూజలు

మంచిర్యాల జిల్లా  చెన్నూరులో  ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి  పర్యటించారు.   జెండా వార్డులోని దుర్గామాత అమ్మవారికి ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ప్రత్యేక పూజలు చేశారు. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో.. తన గన్​ మెన్​ ల ఆయుధాలకు .. దసరా పండుగ సందర్భంగా పూజలు చేశారు,  చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు .. రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.  యావత్​ తెలంగాణ ప్రజలను దుర్గామాత కాపాడాలని ప్రార్థించినట్లు తెలిపారు,