బొక్కల గుట్ట సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్తా : వివేక్ వెంటకస్వామి

  • బైక్​పై పర్యటిస్తూ సమస్యలపై ఆరా తీసిన ఎమ్మెల్యే వివేక్ వెంటకస్వామి

కోల్​బెల్ట్/ జైపూర్​/చెన్నూరు, వెలుగు : బొక్కలగుట్ట గ్రామ సమస్యను మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం ఆయన మార్నింగ్ వాక్​లో భాగంగా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామంలో పర్యటించారు. బైక్​పై ప్రతి వార్డు తిరుగుతూ సమస్యలపై ఆరా తీశారు. గ్రామంలోని సర్వే నెంబర్ 139లోని ఒడ్డెర కాలనీకి సంబంధించిన ఇళ్లు, ఊరచెరువు ప్రాంతాలు క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోకి వెళ్లాయని, కాలనీ అభివృద్ధి పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.

స్పందించిన ఆయన పంచాయతీరాజ్ మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్లి ఒడ్డెరకాలనీ, ఊరచెరువు ప్రాంతాలను తిరిగి బొక్కలగుట్ట పంచాయతీలో కలిపేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని చెప్పగా వెంటనే రూరల్ వాటర్ సప్లై అధికారులకు ఫోన్ చేసి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు

మాజీ జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, డీఆర్డీవో కిషన్, విద్యార్థులతో కలిసి మందమర్రి మాడల్ స్కూల్, సారంగపల్లి రైతువేదిక వద్ద, జైపూర్ మండలం కుందారంలో నూతనంగా నిర్మించిన పీహెచ్​సీని ప్రారంభించారు. కలెక్టర్ కుమార్ దీపక్, డీఎంహెచ్​వో హరీశ్​రాజ్​తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పలు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. 

మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ తనిఖీ..

చెన్నూర్ పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో వసతులను పరిశీలించి, విద్యార్థులను వసతి, భోజన సదుపాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో, హాస్టల్ గదులలో ఫ్యాన్ లు ఏర్పాటు చేసి విద్యార్థులకు వసతులు కల్పించాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్​లో 130 మందికి సీఎం రిలీప్​ఫండ్​, 20 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే వివేక్ అందజేశారు. 

ఆదివాసులతో కలిసి నృత్యాలు..

చెన్నూర్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో చెన్నూర్ ఎమ్మెల్యే డా.జి. వివేక్ వెంకటస్వామి చీఫ్ గెస్ట్​గా పాల్గొన్నారు. పట్టణంలోని రాగిచెట్టునుంచి హాబీబ్ ఫంక్షన్ హాల్ వరకు వివిధ మండలాలకు చెందిన ఆదివాసీలు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మహిళలతో కలిసి కోయ నృత్యం చేశారు. అనంతరం ముస్లిం మైనార్టీ ఫంక్షన్ హాల్ లో కిష్టంపేట కుచెందిన జాడి శ్రవణ్ అనే కాంగ్రెస్ కార్యకర్త తమ్ముడి పెళ్లికి హాజరై

నూతన వధూవరులను ఎమ్మెల్యే ఆశీర్వదించారు. కార్యక్రమాల్లో మందమర్రి మాజీ ఎంపీపీ బొలిశెట్టి కనుకయ్య, మాజీ సర్పంచులు ఓడ్నాల కొమురయ్య, జైపూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఫయాజ్, మాజీ జడ్పీ వైస్​ చైర్మన్ మూల రాజిరెడ్డి, చెన్నూరు కాంగ్రెస్​ టౌన్ ప్రెసిడెంట్ చిన్న సూర్యనారాయణ, పీఎస్​సీఎస్ చైర్మన్ చల్ల రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.