కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలి : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కోల్​బెల్ట్, వెలుగు: కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, సుఖసంతోషాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని  కోరుకుంటున్నట్లు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. శనివారం చెన్నూర్ క్యాంపు ఆఫీస్​లో పోలీసుల సమక్షంలో ఆయన న్యూ ఇయర్ కేక్ కట్​చేశారు. జైపూర్​ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూర్, చెన్నూర్ రూరల్, శ్రీరాంపూర్ సీఐలు రవీందర్, సుధాకర్, రఘుచందర్, ఎస్సైలు రాజేందర్, శ్వేత, కరీంనగర్​లోని ప్రతిమ ఆస్పత్రి సీఈవో రాంచందర్ ​రావు, మందమర్రి, శ్రీరాంపూర్​ సింగరేణి జీఎంలు జి.దేవేందర్, ఎల్వీ సూర్యనారాయణ  మంచిర్యాల హైటెక్​ సీటీ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో వివేక్​ వెంకటస్వామిని వేర్వేరుగా కలిసి బొకేలు అందజేసి న్యూ ఇయర్ ​విషెస్ చెప్పారు. 

బస్టాండ్​ఏరియాలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి తేజస్ ల్యాబ్​ న్యూ ఇయర్​ క్యాలెండర్లను ఆవిష్కరించారు. పాత బస్టాండ్​ వాకర్స్ అసోసియేషన్ ​ప్రెసిడెంట్​ బండి సదానందం యాదవ్, సింగరేణి రిటైర్డ్ కార్మికుల సంఘం ప్రెసిడెంట్​వాసాల శంకర్​ఆధ్వర్యంలో వాకర్స్, రిటైర్డ్​ కార్మికులు సమస్యల పరిష్కారం కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ​టౌన్​ ప్రెసిడెంట్​నోములు ఉపేందర్​ గౌడ్, లీడర్లు సొతుకు సుదర్శన్, గాదే రాంచందర్, మందమర్రి ప్రెస్​క్లబ్ ​ప్రెసిడెంట్​ గాండ్ల సంజీవ్, లీడర్లు పాల్గొన్నారు. 

గాంధారీవనంలో ఎంట్రీ ఫీజు​వసూలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలి

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గాంధారీ వనంలో వాకర్స్ నుంచి రూ.500 ఎంట్రీ ఫీజు వసూలు చేసేందుకు అటవీ ఆఫీసర్ల నిర్ణయాన్ని విరమించుకోవాలని మున్సిపల్​పదో వార్డు కౌన్సిలర్​ పనాస రాజు కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్​ గద్దె రాజుకు వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు.