జనవరి నుంచి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమరావతిలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించి గ్రామంలోని సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా వివేక్ వెంకటస్వామి.. గత 20 ఏళ్ల క్రితం వేసిన రోడ్డు ఇప్పటివరకు ఉందన్నారు. గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో చెన్నూరు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. DMFT ఫండ్స్ నుంచి రోడ్డు వేయాలని ప్రపోజల్స్ పంపుతున్నాం..త్వరలో రోడ్డు నిర్మాణం చేపడుతామన్నారు. గోపాలమిత్ర వెటర్నటి హాస్పిటల్ వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్కూల్ కాంపౌండ్ వాల్ కూడా పూర్తి చేస్తామని చెప్పారు.
కొత్త డిజిటల్ టెక్నాలజీతో 2 అక్టోబర్ నుంచి అందరికీ ఫ్యామిలీ కార్డులు వస్తాయన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. జనవరి నుంచి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ చేసిందన్నారు. ప్రభుత్వం ఎన్ని కష్టాల్లో ఉన్న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత విద్యుత్ తో పాటు మిగతా గ్యారంటీలు అమలు చేస్తుందన్నారు వివేక్. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేశామని చెప్పారు.