చెన్నూరులో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు

కోల్ బెల్ట్​, వెలుగు: బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ప్రజలకు కనీస సదుపాయాలను కూడా కల్పించలేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత అభివృద్ది కార్యక్రమాలు సాగుతున్నాయని చెన్నూరు ఎమ్మెల్యే  వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇవాళ మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం(దొరగారిపల్లె), భీమారం, మద్దికల్, ఎల్కేశ్వరం, కొత్తపల్లి,  వెంకట్రావుపల్లి, దుబ్బాపల్లి, ముదిగుంట తదితర  గ్రామాల్లో రూ.1కోటితో చేపట్టిన  వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా  మాట్లాడిన ఆయన.. చెన్నూరు నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణాల్లో డ్రింకింగ్ వాటర్, సీసీ రోడ్లు, డ్రైయినేజీలు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గత పాలకులు అభివృద్ధి పనులను పట్టించుకోలేదని.. ఎన్నికల ప్రచారంలో ప్రజలు సమస్యలను తన  దృష్టికి తీసుకవచ్చారన్నారు.  తాను ఎమ్మెల్యే అయిన వెంటనే  డ్రింకింగ్ వాటర్, డ్రైయినేజీలు, సీసీ రోడ్ల నిర్మాణానికి మొదటి  ప్రయారిటీ ఇచ్చినట్లు చెప్పారు.  ప్రస్తుతం నియోజకవర్గంలో రూ.100 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు 90శాతం పూర్తి అయ్యాయి. మరో  మరో నెల రోజుల్లో అందుబాటులోకి వస్తాయన్నారు.  గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందని, మిషన్ భగీరథ ఫెల్యూలర్ స్కీం ఎక్కడ కూడా నీళ్లు రావడంలేదని పేర్కొన్నారు.  నీటి ఎద్దడి ఉన్న చోట అవసరమైనన్నీ బోర్లు నిర్మిస్తున్నామన్నారు.  

ఏడాది లోపు అన్ని గ్రామల్లో డ్రింకింగ్ వాటర్, సీసీ రోడ్లు, డ్రైయినేజీల నిర్మాణాలు చేపడుతామని భరోసా కల్పించారు. మందమర్రి, చెన్నూరు, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో అమృత్ స్కీం ద్వారా రూ.100 కోట్లతో  డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం నిర్మాణ పనులు  నడుస్తున్నాయని,  ఏడాదిలోపు అన్ని వార్డుల్లో నల్లాలద్వారా   వాటర్ సప్లై జరుగుతుందని చెప్పారు.  భీమారం మండల కేంద్రంలో వైకుంఠధామం వెహికల్ కు  ఫండ్స్ కేటాయిస్తానని హామీ  ఇచ్చారు. ఇందారం గ్రామంలో పోచమ్మ తల్లిని దర్శించుకొని పూజలు చేశారు. ఈ  సందర్భంగా జైపూర్, భీమారం మండల కాంగ్రెస్ లీడర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజలు పలు చోట్ల చెన్నూరు ఎమ్మెల్యే వివేక్  వెంకటస్వామిని ఘనంగా సన్మానించారు