చెన్నూరు రూపురేఖలు మారుస్తాం: ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లా  మందమర్రి రామన్ కాలనీ ROB బ్రిడ్జి పై 40 లక్షలతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్ సిస్టంను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి  ప్రారంభించారు.   ఈ సభలో ఆయన మాట్లాడుతూ .. ఇంకా చెన్నూరు నియోజక వర్గం లో 500 కోట్ల రూపాయిలతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. 2025 లో చెన్నూరు రూపురేఖలు మారుతాయన్నారు.  తెలంగాణలో  కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు పేదలకు వైద్యం అందుతుదన్నారు.  

కాంగ్రెస్ ప్రజా పాలనలో  ఇందిరమ్మ ఇళ్ల ను అర్హులైన పేదలకు పారదర్శకంగా అందించేందుకు ఇందిరమ్మ కమిటీలను కాంగ్రెస్ ప్రభుత్వం వేసింది.  కాంగ్రెస్ పార్టీ  ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసేందుకు సిఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారంటూ...  మందమర్రి ప్రజలకు దీపావళి కానుకగా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.   మందమర్రి టౌన్ లో ఎక్క్కడ అయితే సెంట్రల్ లైటింగ్ అవసరమో అక్కడ కూడా ఏర్పాటు చేస్తామన్నారు.  ఇప్పటికే రోడ్డు డ్రైనేజ్ పై ఫోకస్ పెట్టామని.. ఎక్కడ ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ప్రజలకు తెలిపారు.  మందమర్రిలో 108, 102 అంబులెన్స్​ లు అందుబాటులో ఉన్నాయని... అవి సరిపోకపోతే ఇంకా ఇస్తామన్నారు.  ప్రైవేట్​ ఆస్పత్రుల్లో వృధా ఖర్చు చేయకుండా.. రాజీవ్​ ఆరోగ్యశ్రీని అందరూ ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి సూచించారు. 

Also Read : సీఎం రేవంత్ రెడ్డితోనే నా పంచాయితీ