ఇసుక ట్రాక్టర్లకు పర్మిషన్లపై డ్రైవర్ల హర్షం .. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి మండల ఇసుక ట్రాక్టర్లకు ఆన్​లైన్​లో పర్మిషన్​ ఇప్పించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ఫ్లెక్సికీ క్షీరాభిషేకం నిర్వహించారు.  సోమవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ సరిహద్దు శ్రీనివాస్ గార్డెన్స్​ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మందమర్రి మండల ట్రాక్టర్​అసోసియేషన్​ ప్రెసిడెంట్, మున్సిపల్​ కౌన్సిలర్​ పోలం సత్యనారాయణ ఆధ్వర్యంలో ట్రాక్టర్​ యాజమానులు, డ్రైవర్లు ఎమ్మెల్యే ఫోటోకు క్షీరాభిషేకం చేశారు.  కొన్ని నెలలుగా ఆన్​లైన్​ ద్వారా మందమర్రి మండల పరిధికి ఇసుక రవాణా నిలిపివేశారన్నారు. 

 దీంతో నిర్మాణ రంగం, భవన నిర్మాణ కార్మికులు, ట్రాక్టర్​ యాజమానులు, డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. తమ సమస్యను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే  సంబంధిత మంత్రులు, ఆఫీసర్లతో మాట్లాడి ఆన్​లైన్​లో ఇసుక రవాణాకు పర్మిషన్​ ఇప్పించారన్నారు.   అసోసియేషన్ ఉపాధ్యక్షులు చిప్పరి శ్రీనివాస్,  తిమ్మాపూర్, బొక్కలగుట్ట, మందమర్రి ఇన్​ఛార్జ్​లు  సంతోష్, తన్నీరు సందీప్,  శివకుమార్, యజమానులు,  డ్రైవర్లు పాల్గొన్నారు.