కాళేశ్వరం వల్ల కాంట్రాక్టులకు తప్ప ఎవరికీ లాభం లేదు: ఎమ్మెల్యే వివేక్

బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎవ్వరికీ లాభం జరగలేదు కానీ.. కేసీఆర్ మాత్రం కాంట్రాక్టర్లకు డబ్బులు దోచిపెట్టారని ఆరోపించారు.  కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం అందరికీ రైతు బంధు ఇస్తుందన్నారు  వివేక్. 

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని దేవులవాడ గ్రామంలో  బాబా సాహెబ్ అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాలను ఆవిష్కరించారు   ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  జ్యోతి ప్రజ్వలన చేసి పంచశీల జెండాను ఆవిష్కరించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ సందర్బంగా మాట్లాడిన వివేక్..  అంబేద్కర్ జ్యోతి రావు పూలే విగ్రహాలను పెట్టుకోవడం చాలా ఆనందంగా ఉంది.  అంబేద్కర్ నిర్మించిన విధి విధానాలను ప్రతీ ఒక్కరూ అమలు చేయాలి. పార్లమెంట్ లో అమిత్ షా అంబేద్కర్ ను  కించపరిచారు.

Also Read :- ఎర్రచందనం స్మగ్లర్కు నేషనల్ అవార్డా.?.. పోలీస్ విలనా

 దళితులు ఇప్పటికీ వెనకబడే ఉన్నారు.  అంబేద్కర్ మనకు కల్పించిన రిజర్వేషన్లు కల్పించడం వల్లే మనం ఈరోజు అన్ని రంగాల్లో ముందుంటున్నాము.  అమిత్ షా కి ఎప్పుడైనా దళితులను కలిస్తే అంబేద్కర్ గొప్పతనం తెలిసేది.అంబేద్కర్ విగ్రహాలను అన్ని చోట్ల ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహాలు పెట్టాలని మా నాన్నా  నాకు ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా 100 వరకు విగ్రహాలను పెట్టుకోవడం జరిగింది. ఎక్కడ అంబేద్కర్ విగ్రహాలు కావాలన్న నేను నిధులు ఇస్తాను.అందరూ కలిసి ఐకమత్యంగా ఉండి మన హక్కులను పోరాడి సాధించుకుందామని అన్నారు వివేక్.

 గ్రామంలో నిధులను మంజూరు చేసి అభివృద్ధి చేసుకుందాం .మన నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ సోమనపల్లి లో ఏర్పాటు చేస్తున్నాము. నేను నియోజకవర్గంలో డ్రైనేజీ రోడ్ల సమస్యలు చాలా చోట్ల పరిష్కరించాను . స్కూల్ పిల్లలకు ఆర్ వో ప్లాంట్ లు ఇస్తున్నాము. కూలీ రైతుల గురించి నేను అసెంబ్లీలో కేటీఆర్ ను నిలదీయడం జరిగింది.దళితులకు ఎక్కడ కూడా భూమి లేదు. నేను కౌలు రైతులకు రైతుబందు ఇవ్వాలని అంటే కేసీఆర్ ఒప్పుకోలేదు.  నేతకాని  భవనం నిర్మాణం కోసం 5 గుంటల భూమి కేటాయించడం జరిగింది. 20 లక్షల నిధులతో అన్ని సౌకర్యాలతో భవనం నిర్మిస్తాం. నేతకాణి సమాజానికి నేతకానీ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తున్నాను. 1980లో మా నాన్న కాకా వెంకటస్వామి లెదర్ పార్కును ఏర్పాటు చేసారు..త్వరలోనే లెదర్  పార్కును పునః ప్రారంభం చేస్తాం అని చెప్పారు  వివేక్.