వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వివేక్

కోల్​బెల్ట్, వెలుగు:​ చెన్నూర్​ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి శనివారం మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. కాసీపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్​ లీడర్ బన్న లక్ష్మణ్–స్వరూప దంపతుల కొడుకు రోహిత్​ కుమార్–హిమజ వివాహ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి హాజరయ్యారు. 

వధూవరులను ఆశీర్వదించారు. చెన్నూర్ ఎమ్మెల్యేగా వివేక్​ వెంకటస్వామి ఎన్నికై ఏడాది గడిచిన సందర్భంగా కాంగ్రెస్​లీడర్లు ఆయనను ఘనంగా సన్మానించారు. మంచిర్యాల హైటెక్ ​సిటీలోని తన నివాసంలో ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి సోషల్ ​మీడియా వారియర్స్​తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. 

బాధిత కుటుంబాలకు పరామర్శ

చెన్నూర్ మండలంలోని కొమ్మెర గ్రామానికి చెందిన ముత్యాల శ్రీకాంత్ ​గౌడ్, కాల్వ ఎల్లారీ  వివిధ కారణాలతో ఇటీవల మృతిచెందారు. బాధిత కుటుంబాలను శనివారం ఎమ్మెల్యే వివేక్ పరామర్శించారు. ఆ కుటుంబసభ్యులను ఓదార్చారు.