మంచిర్యాల జిల్లా మందమర్రిలో డ్రింకింగ్ వాటర్ కోసం అమృత్ స్కీం కింద రూ. 31 కోట్లు మంజూరైనట్లు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ అధికారులు, సిబ్బందితో రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. గత ప్రభుత్వ హయాంలో మందమర్రికి సరిగా నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధి పనులు జరగలేదన్నారు. దీపక్ నగర్ లో రోడ్లు డ్రైనేజ్ లు లేక కాలనీ అస్తవ్యస్తంగా ఉందని.. .దానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు.
భవిష్యత్తులో మందమర్రికి తాగునీటి సమస్య ఉండదన్నారు ఎమ్మెల్యే వివేక్ . ఏళ్ల తరబడి విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మందమర్రి వార్డుల్లో ట్యాంకర్ల ద్వారా త్రాగు నీరు అందించామన్నారు. దివంగత నేత కాకా హయాంలో మందమర్రికి తాగునీటి కష్టాలు తీర్చేందుకు ముల్కల నుంచి మందమర్రికి, బెల్లంపల్లి మున్సిపాలిటీలకు శాశ్వత తాగునీటి పథకాన్ని మంజూరు చేయించారని వెల్లడించారు. మందమర్రిని అభివృద్ధి బాటలో తీసుకుపోవడమే తమ లక్ష్యమని చెప్పారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి