కోల్‌బెల్ట్/కోటపల్లి/చెన్నూర్, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం జరిగిన వివాహ వేడుకలు, గృహప్రవేశ కార్యక్రమాల్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. మందమర్రిలోని శివసాయి ఫంక్షన్ హాల్లో రవళి-–సతీశ్, క్యాతనపల్లి మున్సిపాలిటీలోని గద్దెరాగడి ఎన్వీఆర్ఫంక్షన్ హాల్లో గాయత్రి-–సతీశ్, భీమా గార్డెన్స్‌లో కుర్మ సాగరిక–-శేఖర్, జైపూర్ మండలం మిట్టపెల్లి(కొమ్ముగూడెం)లో శంకర్-–హిమాణి, చెన్నూర్ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో కోటపెల్లి మండలంలోని నాగంపేట గ్రామానికి చెందిన ఠాకూర్ రాకేశ్ శింగ్–-రమ్య వధూవరులను ఆశీర్వదించారు.
జైపూర్ మండల కాంగ్రెస్ లీడర్ నవీన్ గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. కోటపల్లి మండలం బోరంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దుర్గం కుభీర్ ఇటీవల యాక్సిడెంట్లో చనిపోగా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మంచిర్యాలలో కాంగ్రెస్ లీడర్బత్తుల శ్రీనివాస్ యాదవ్ తల్లి రాధ దినకర్మకు హాజరయ్యారు.