ప్రతి గ్రామంలో ఏడాదికి రెండు అభివృద్ధి పనులు చేస్తా: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

ప్రతి గ్రామంలో  ఏడాదిలో రెండు అభివృద్ధి పనులు చేస్తానన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మార్నింగ్ వాక్ చేసిన  వివేక్ వెంకటస్వామి. ఈ సందర్బంగా స్థానికులను సమస్య లు అడిగి తెలుసుకున్నారు. మొహర్రం వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన పీరిలను దర్శించుకున్నారు. అనంతరం చెన్నూర్ మండల పరిధిలోని బుద్దారం, కన్నెపల్లి, సంకారం, వడ్డే పల్లి, చింతలపల్లి, అక్కేపల్లి, శివలింగపూర్  గ్రామాల్లో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి. ప్రతి గ్రామంలో  ఏడాదిలో రెండు అభివృద్ధి పనులు తప్పనిసరి చేస్తానన్నారు. పెద్ద గ్రామానికి రూ.10లక్షలు, చిన్న గ్రామానికి రు. 5లక్షలు మంజూరు చేస్తున్నానని చెప్పారు. ఈ నిధులతో గ్రామల్లో మౌలిక సదుపాయాలు,అభివృద్ధి పనులకు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిన్న సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. వాటిని తెలుసుకుని పరిష్కరించేందుకు గ్రామాల పర్యటన సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. ఒక్కొక్కటిగా అన్ని సమస్యలను 100 శాతం పరిష్కరిస్తానని చెప్పారు. ప్రజలు సంతృప్తి చెందేలా పాలన అందిస్తానన్నారు. దోమల బెడదను తొలగించేందుకు గ్రామాల్లో ఫాగింగ్ కు చేయిస్తామని చెప్పారు వివేక్ వెంకటస్వామి.