లెదర్ ఇండస్ట్రీ పూర్వ వైభవానికి కృషి చేస్తా : చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: లెదర్ పరిశ్రమ పూర్వ వైభవానికి  తన వంతు కృషి చేస్తానని చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. తెలంగాణ మాదిగ చర్మకారుల  ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు మంగళవారం వివేక్ వెంకటస్వామిని కలిశారు. లెదర్ పరిశ్రమపై ఆధారపడుతున్న వారంతా ఉపాధి లేక  ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సతీష్ మాదిగ ఆధ్వర్యంలో నేతలు ఎమ్మెల్యే వివేక్ ను కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. 
లెదర్ పరిశ్రమను రివైజ్  చేసేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.  దీనిపై అధ్యయనం అవసరమని.. చెన్నై,  కర్ణాటక తదితర ప్రాంతాలలో పరిశ్రమలు ఏ విధంగా నిర్వహిస్తున్నారో త్వరలోనే అధ్యయనం చేసి పరిష్కార మార్గం ఆలోచిస్తానని  వివేక్ తెలిపారు. దీనిపై అసెంబ్లీలో కూడా  మాట్లాడనున్నట్లు హామీ ఇచ్చారు.