కాళేశ్వరం దేవస్థానం మాజీ చైర్మన్ కుటుంబానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ పరామర్శ

మహాదేవపూర్, వెలుగు: కాళేశ్వరం దేవస్థానం మాజీ చైర్మన్ గుడాల కృష్ణమూర్తి మృతి చెందిన విషయం తెలియడంతో గురువారం చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‎కు చెందిన గుడాల కృష్ణమూర్తి రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరున్న లీడర్ అని కొనియాడారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు.