రూ.100 కోట్లతో డ్రింకింగ్ వాటర్ సప్లై : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

చెన్నూరు, క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటిల్లో రూ.100కోట్లతో త్రాగునీరు సరఫరా పనులు జరుగుతున్నాయని చెన్నూర్ ఎమ్మె్ల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. జైపూర్ మండలం నర్వ గ్రామంలో సిసి రోడ్, మహిళా భవన్, ఇందారం గ్రామాల్లో  డ్రైనేజి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈకార్యక్రమంలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితోపాటు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. చెన్నూరు నియోజవర్గంలో అంతటా రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేస్తున్నామని.. ప్రస్తుతం రూ.60కోట్ల నిధులతో పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. రూ.100 కోట్లు నేషనల్ హై వే 63 కొత్త రోడ్డు, విస్తరణ పనులు చేపడుతున్నామని తెలిపారు. 

రూ.2కోట్లుతో హైవేపై పర్మినెంట్ రిపేర్ పనులు చేపడుతున్నామని.. సోమనపల్లిలో రూ.125 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసామని హామి ఇచ్చారు ఆయన. కాంగ్రెస్ సర్కార్ ప్రజల ఆకాంక్ష మేరకు అభివృద్ధి పనులు చేస్తుందని గడ్డం వివేక్ అన్నారు. తాగు నీటి ఏద్ధాడి లేకుండా సుమారు 100బోర్లు గ్రామాల్లో ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు.