బెంచీలు మంజూరు చేయాలని వినతి

ధర్మారం, వెలుగు: ధర్మారం మండలం మల్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురుకుల పాఠశాలకు విశాక ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫున బెంచీలు మంజూరు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాడే సూర్యనారాయణ.. ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చెన్నూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామిని కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ లో వివేక్ వెంకటస్వామిని కలిశారు. ధర్మారం మండలం మల్లాపూర్ గురుకులంలో బెంచీలు అవసరమున్నాయని ఈ మేరకు ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫున మంజూరు చేయించాలని వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఆయన 15 రోజుల్లోపు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో లీడర్లు ఎండీ హఫీజ్, దేవి కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎర్రం సంజీవ్, ఎండీ ఆషు పాల్గొన్నారు.